: 'షేర్ కిసీస్ డర్ తే నహీ' అంటూ రగులుతున్న భారత సైనికుడి అనర్గళ ప్రసంగం... సోషల్ మీడియాలో వైరల్


పాకిస్థాన్ ఉగ్రవాద దాడులపై రగిలిపోతున్న ఓ జవాను తన వాహనంలో నిలబడి చేసిన అనర్గళ ప్రసంగం, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'షేర్ కిసీసే డర్ తే నహీ' (పులి ఎవరికీ భయపడదు) అంటూ మొదలైన ఆ ప్రసంగంలో పాకిస్థాన్ వైఖరిని ఎండగడుతూ, కవిత్వం చెప్పిన ఆ సైనికుడికి యువత జేజేలు పలుకుతూ, సామాజిక మాధ్యమాల్లో షేర్ మీద షేర్ చేసుకుంటున్నారు. పాకిస్థాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, ఇలాంటి దాడులకు భారత్ భయపడదని, దేశ ప్రజలకు భరోసా ఇచ్చాడు. అతనేం చెప్పాడంటే... పులి ఎవరికీ భయపడదు వెళ్లి పాకిస్థాన్ కు చెప్పండి మేము భయపడం అణు బాంబులకు మేము భయపడం బాంబు పేలుళ్లకు మేము భయపడం దాడులకు భయపెట్టాలని చూసే వారికే భయాన్ని పుట్టిస్తాం భారతావని గడ్డపై మేము తాగే నీటి శక్తి తెలియజేస్తాం అదృష్టవశాత్తూ నాటి యుద్ధంలో బతికారు ఆనాటి యుద్ధాలను గుర్తు చేసుకోండి కార్గిల్ యుద్ధంలో ఏం జరిగిందో జ్ఞాపకం తెచ్చుకోండి పాకిస్థాన్... చెవులు తెరచుకొని విను మేము గురి పెడితే ఏం జరుగుతుందో తెలుసుకో మీ ఆటలు సాగనివ్వం పాకిస్థాన్ ఇప్పటికే చేసింది ఎక్కువైందని, ఇకనైనా తమ భూభాగంపై ఉన్న ఉగ్రవాదుల ఆగడాలను అడ్డుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. తాము తిరగబడితే వచ్చే మహా ప్రళయంలో పాక్ మట్టికొట్టుకుపోతుందని తెలిపాడు. ఇందులో ఎటువంటి అనుమానాలూ లేవని స్పష్టంగా చెప్పిన ఆ జవాన్ ఎవరన్నది మాత్రం ఈ వీడియోలో తెలియనప్పటికీ, అతని ఉద్వేగ ప్రసంగం మాత్రం వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News