: లండన్ స్కైపే కార్యాలయాన్ని మూసేయనున్న మైక్రోసాఫ్ట్... ఇండియన్స్ సహా 400 మంది ఇంటికి!
సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ లండన్ లోని స్కైపే కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకుంది. ఇందులో పనిచేస్తున్న వారిలో అత్యధికులను విధుల నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు సంస్థ వర్గాలు వెల్లడించాయని 'ఫైనాన్షియల్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కొన్ని ఇంజనీరింగ్ పొజిషన్లను ఏకీకృతం చేసే దిశగా నిర్ణయం తీసుకున్నామని, అందులో భాగంగా లండన్ లోని కార్యాలయాన్ని మూసేస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారి చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, రెడ్ మాండ్, పాలో ఆల్టో, వాంకోవర్ సహా ఇతర యూరప్ స్కైపే ఆఫీసులను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. కాగా, ఈ ఆఫీస్ నుంచి 400 మందిని తొలగించనుండగా, అందులో భారతీయులు కూడా ఉన్నట్టు సమాచారం.