: అమెరికాలోని న్యూజెర్సీలో మరోసారి బాంబు కలకలం


రెండు రోజుల క్రితం అమెరికాలో న్యూయార్క్ లోని మన్‌హటన్‌లో శక్తిమంతమైన పేలుడుతో 29 మంది గాయాలపాలయిన ఘటన మరవకముందే మరో బాంబు పేలుడు చేయాలని దుండగులు కుట్రపన్నారు. న్యూజెర్సీలోని ఎలిజబెత్‌ రైల్వే స్టేషన్‌ పట్టాలపై బాంబు కలకలం రేపింది. ఓ ఫోనుకు వైరుతో కనెక్షన్ ఇచ్చి దానిని బాంబుకు అనుసంధానం చేసి దీనిని పేల్చాలని దుండ‌గులు ప్లాన్ చేశారు. అయితే, ఆ ప్రాంతంలో వెళుతోన్న ఇద్ద‌రు వ్య‌క్తులు బాంబుని గ‌మ‌నించి, ఈ స‌మాచారాన్ని వెంట‌నే పోలీసులకు తెలియ‌జేయ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు బాంబును నిర్వీర్యం చేశారు. అనంత‌రం పోలీసులు స‌ద‌రు రైల్వేస్టేషన్‌ను ఖాళీ చేయించి, నిఖీ చేబట్టారు. ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాల ముందు జ‌రుగుతున్న ఇటువంటి ఘ‌ట‌న‌లు అల‌జ‌డి రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News