: మెదక్‌లో దారుణం... డిగ్రీ చదువుతున్న యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
మెదక్‌లోని సదాశివపేటలో ఈరోజు ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న యువతిపై ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడానికి ఒప్పుకోవట్లేదంటూ యువతిపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందజేశారు. తీవ్రగాయాలపాలయిన యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దాడికి పాల్పడిన యువకుడిని సతీశ్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ప్రేమోన్మాది కోసం గాలింపు షురూ చేశారు.