: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నాలుగోరోజూ కొనసాగుతున్న బంద్.. 144 సెక్షన్ అమలు
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కొత్త జిల్లాలు, మండలాలు, డివిజన్ల ఏర్పాటు తుది దశలో ఉండగా మరోవైపు తమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ పలు ప్రాంతాల వాసులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లను జిల్లా కేంద్రం చేయాలని ఆ ప్రాంతవాసులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వరసగా నాలుగోరోజూ బంద్ కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో అధికారులు భారీగా పోలీసులను మోహరింపజేశారు. చేవెళ్లలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.