: నేడు అక్కడక్కడ, రేపు చాలా చోట్ల భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుండటంతో నేడు తెలుగురాష్ట్రాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఆవర్తనం, రేపు లేదా ఎల్లుండి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని, ఆపై వాయుగుండంగానూ మారవచ్చని అధికారులు అంచనా వేశారు. రేపు కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొన్నారు.