: ‘అమ్మ’ పిలుపునకు స్పందన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో హిజ్రాలు
తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో హిజ్రాలు బరిలోకి దిగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న హిజ్రాలు దరఖాస్తు చేసుకోవాలన్న ముఖ్యమంత్రి జయలలిత పిలుపునకు హిజ్రాలు స్పందించారు. వేలాదిమంది ముందుకొచ్చి కౌన్సిలర్, జిల్లా పంచాయతీ మెంబర్, యూనియన్ కౌన్సిలర్ తదితర పదవులకు టికెట్లు కోరుతూ దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవలు చేస్తామని చెబుతున్నారు. ఈ మేరకు నగరానికి చెందిన ముగ్గురు హిజ్రాలు స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని దరఖాస్తులు సమర్పించారు. డప్పు వాయిద్యాల నడుమ మద్దతుదారులతో కలిసి వచ్చి దరఖాస్తులు అందజేశారు. కార్పొరేషన్ పరిధిలోని 40వ డివిజన్‌కు సుధ, 109వ డివిజన్‌కు నూరి, మధురై సౌత్ 74వ డివిజన్‌కు భారతి దరఖాస్తు చేసుకున్నారు. సుధ గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ సంపాదించేందుకు చేసిన ప్రయత్నం విఫలం కాగా భారతి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది.