: టీడీపీ నేత భూమాపై రౌడీషీట్ ఎత్తివేసేందుకు రంగం సిద్ధం.. ఆయన వినతిని పరిశీలిస్తున్న ప్రభుత్వం
2014లో నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఘర్షణలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్ ను కూడా ఓపెన్ చేశారు. తనపై నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఆయన వినతిని పరిశీలించాలని కోరుతూ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. కేసు ఎత్తివేత విషయంపై మరికొన్ని రోజుల్లో పోలీసులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. ఆయనపై కేసులు ఎత్తివేత విషయం వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రతిపక్షంలో వున్నప్పుడు కేసులు నమోదు చేసిన ప్రభుత్వం, పార్టీ మారగానే కేసులు ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు మరోపక్క ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. కాగా వైసీపీ తరఫున గెలుపొందిన భూమా నాగారెడ్డి కుమార్తెతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.