: ఏటీఎం కార్డులో ఎలక్ట్రానిక్ చిప్ ఉండాల్సిందే.. గడువు పొడిగించే ప్రసక్తే లేదన్న ఆర్బీఐ


ఎలక్ట్రానిక్ చిప్ అమర్చిన ఏటీఎం కార్డులను అందజేసేందుకు ఇచ్చిన గడువును పొడిగించే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ తేల్చి చెప్పింది. ఖాతాదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మ్యాగ్నిటిక్ స్ట్రిప్ ఉన్న ఏటీఎం కార్డుల స్థానంలో ఎలక్ట్రానిక్ చిప్ వున్న కార్డులను బ్యాంకులు పంపిణీ చేస్తున్నాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలను నివారించేందుకు ఎలక్ట్రానిక్ చిప్ ఉన్న కార్డులను ఖాతాదారులకు అందించాలంటూ గతేడాది మేలో రిజర్వ్ బ్యాంకు బ్యాంకులను ఆదేశించింది. ఆర్బీఐ ఆదేశంతో పలు ప్రయివేటు బ్యాంకులు కార్డులు అందించాయి. జాతీయ బ్యాంకులు మాత్రం గడువు పొడిగించాలంటూ ఆర్బీఐని కోరాయి. సానుకూలంగా స్పందించిన రిజర్వ్ బ్యాంకు ఈనెల 30 వరకు గడువు పొడిగించింది. అయితే పంపిణీ ఇంకా పూర్తికాలేదని, మరోమారు గడువు పొడిగించాలని కోరడంతో ఆర్బీఐ అందుకు నిరాకరించింది. ఇది వరకు ప్రకటించినట్టు 2018 ప్రారంభం నాటికి ఎలక్ట్రానిక్ చిప్‌లు కలిగిన ఏటీఎం కార్డులు అందరికీ అందుబాటులో ఉండాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News