: నాడు వాజ్‌పేయికి.. నేడు మోదీకి.. పాక్ వెన్నుపోట్ల పరంపర


నమ్మి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్న భారత్‌ను దొంగ దెబ్బతీయడాన్ని పొరుగుదేశం పాకిస్థాన్ అలవాటుగా మార్చుకుంది. భారత్ స్నేహ హస్తం అందిస్తుంటే పాక్ ఆ చేతిని మెలితిప్పుతోంది. పాక్‌తో దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారీ ఆ దేశం మరింత దూరంగా జరుగుతోంది. వెన్నుపోట్లతో విరుచుకుపడుతోంది. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బస్సు దౌత్యంతో దాయాది దేశానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తే ఆ వెంటనే కార్గిల్ రూపంలో వెన్నుపోటు పొడిచింది. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా పాక్‌తో సత్సంబంధాలు నెరిపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంటే పాక్ తన నమ్మకద్రోహాన్ని, నయ వంచనను మరోమారు బయటపెట్టుకుంది. ఇటీవల ఆఫ్గనిస్థాన్ వెళ్లిన ప్రధాని మోదీ వస్తూవస్తూ పాక్ వెళ్లి నవాజ్ తల్లి షమీమ్ అక్తర్ పాదాలకు నమస్కరించి, షరీఫ్ మనవరాలి పెళ్లికి హాజరై వచ్చారు. మోదీ చొరవను ప్రపంచం కీర్తించింది. దీనిని తట్టుకోలేకపోయిందో ఏమో పాక్ మరోమారు తన నైజాన్ని ప్రదర్శించింది. యూరీలోని ఆర్మీ బేస్‌పై దాడి చేసి తమకు స్నేహం చెయ్యడం చేతకాదని నిరూపించింది. ఎవరు ఎంత చెప్పినా తన పెడబుద్ధి, వెన్నుపోటుతనం పోదని నిరూపించింది.

  • Loading...

More Telugu News