: క్రికెటర్లపై సినిమాలు అవసరమా.. గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రికెటర్లపై సినిమాలు తీయాల్సిన అవసరం లేదంటూ మరో క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ’ విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. క్రికెటర్ల కంటే దేశం కోసం త్యాగాలు చేసిన వారు, గొప్ప పనులు చేసిన వారు ఎందరో ఉన్నారని, వారిపై సినిమాలు తీయాలని సూచించాడు. క్రికెటర్ల జీవితంపై సినిమాలు తీసే అంశంపై తనకు నమ్మకం లేదంటూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించి చర్చకు తెరలేపాడు. దీనిపై క్రికెటర్లు, ముఖ్యంగా ధోనీ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.