: ఘనంగా ప్రారంభమైన ‘జాగ్వార్’ ఆడియో వేడుక
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న ‘జాగ్వార్’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్, మాజీ ప్రధాని దేవెగౌడ, నిఖిల్ తండ్రి, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సినీ తారలు జగపతిబాబు, బ్రహ్మానందం, తమ్మారెడ్డి భరద్వాజ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తదితరులు పాల్గొన్నారు.