: కొత్తదనం వచ్చాక పాతదనం గౌరవంగా పక్కకు వెళ్లాలి.: సినీ హాస్యనటుడు పృథ్వీ


కొత్తదనాన్ని ఆహ్వానించకపోతే కొట్టుకుపోతామని సినీ హాస్యనటుడు పృథ్వీ అన్నాడు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఖడ్గం సినిమాలో ‘30 ఇయర్స్ ఇండస్ట్రి’ అనే డైలాగ్ క్యాజువల్ గా అన్నాను. ఈ డైలాగ్ తో నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఆర్థికంగా బాగున్నాను. అయితే నేను ఇండస్ట్రీలోకి వచ్చి 18 సంవత్సరాలే అయింది’ అన్నారాయన. ‘కొత్తదనం వచ్చాక పాతదనం గౌరవంగా పక్కకు వెళ్లాలి.. నేను ఇక్కడ పాతుకుపోయి కూర్చుంటానంటే ఇక్కడ కుదరదు’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను భోజనం కూడా చేయలేని రోజులు చాలా ఉన్నాయని, తాను ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికే తనకు పెళ్లయిందని, ఎంఏ చదువుతున్నానని చెప్పారు. ఇండస్ట్రీలో మనకు సంబంధంలేని వాళ్లకు కూడా నమస్కారం పెట్టాలని, మొదట్లో ఆ కల్చర్ కు విసిగిపోయానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News