: విభజన బిల్లు పాసైందా? లేదా? అనేది ఎప్పటికీ జవాబు దొరకని ప్రశ్నే!: జస్టిస్ చలమేశ్వర్


రాష్ట్ర విభజన రాజ్యాంగ బద్ధంగా జరిగిందా? లేదా? అనే ప్రశ్న ఎప్పటికీ మిగిలే ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన ‘విభజన కథ’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ, విభజన బిల్లు పార్లమెంటులో పాసైందా? లేదా? అనేది ఎప్పటికీ జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలి ఉంటుందని, దీనిపై ఎవరి అభిప్రాయం వారిదని అన్నారు. విభజన ప్రక్రియలో ఎవరు సంతృప్తిగా ఉన్నారు? ఎవరు అసంతృప్తిగా ఉన్నారు? అనేది మరో చర్చ అని అన్నారు. రాజకీయంగా కలవడం, విడిపోవడం సహజమని అన్నారు. కాగా, విభజన సమయంలో తెరవెనుక జరిగిన మంత్రాంగాలు, ముఖ్యమైన సంఘటనల గురించి ఉండవల్లి ఈ పుస్తకంలో ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News