: విడిపోవడం వల్ల ఏపీకే లాభమని కేసీఆర్ చెప్పారు: ఉండవల్లి
రాష్ట్ర విభజన వల్ల ఏపీకే లాభమని కేసీఆర్ నాడు చెప్పారని సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో విభజనకు ముందు జరిగిన విషయాలను ఆయన ప్రస్తావిస్తూ,‘విడిపోవడానికి మేము సమ్మతమేనని కేసీఆర్ చెప్పమన్నారు. అప్పుడు సిట్టింగ్ మొదలవుతుందని, కాంగ్రెస్ పార్టీకి చాలా మంచవుతుందని, వేరే ఆశలేమి తనకు లేవని, రాష్ట్ర విభజన ఒక్కటే తన ఆశ అని అప్పుడు కేసీఆర్ చెప్పారు. అతను బాగా మాట్లాడతాడు, బాగా చెప్పుకొచ్చాడు. నేను కేసీఆర్ తో ఏకీభవించి, వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డిగారికి చెప్పాను. కేసీఆర్, రాజశేఖరెడ్డిగారు ఏమి మాట్లాడుకున్నారో నాకు తెలియదు’ అని అరుణ్ కుమార్ అన్నారు.