: విభజన కన్నా... విభజన జరిగిన తీరు ఎక్కువగా గాయపరిచింది: ఉండవల్లి అరుణ్ కుమార్
రాష్ట్ర విభజన జరగడం కన్నా, అది జరిగిన తీరు ఎక్కువగా గాయపరిచిందని, అవమానపరిచిందని సీనియర్ రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నాకు డైరీ రాసే అలవాటుంది. పాత పేజీలన్నీ తిరగేశా. విభజన విషయంలో ఎందుకిలా జరిగిందని ఆలోచిస్తే.. రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఇంత ఘోరం ఎప్పుడూ జరగలేదు. పార్లమెంట్ వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరుపుకుంటూ వచ్చినప్పుడు పార్లమెంట్ తలుపులు మూయలేదు. విభజన సమయంలో.. పార్లమెంట్ తలుపులు మూసేసి.. డివిజన్ లేకుండా విభజన చేయడం దారుణం’ అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.