: రాహుల్ గాంధీపై స్మృతీ ఇరానీ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ విమర్శలు గుప్పించారు. అమేథీ నియోజకవర్గంలో ఈరోజు ఆమె పర్యటించారు. అమేథి నియోజకవర్గంలోని పిప్రి గ్రామంలో కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న గట్టు నిర్మాణ ప్రాజెక్టును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వరద నివారణకు గట్టు నిర్మించే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అమేథీ నియోజకవర్గ ప్రతినిధి విఫలమయ్యారని, కేంద్రమంత్రిగా తాను ప్రజలకు అండగా ఉంటానని స్మృతీ ఇరానీ పేర్కొంది. కాగా, జగదీశ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.