: యురి సెక్టార్ పై దాడుల విషయమై ముందే హెచ్చరించాం: ఇంటెలిజెన్స్ విభాగం
జమ్మూకాశ్మీర్ లోని యురి సెక్టార్ పై ఉగ్రదాడులు జరిగే అవకాశముందని గతంలోనే తాము హెచ్చరించామని ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. సెప్టెంబరు 15వ తేదీ నాడు తాము ఈ హెచ్చరికలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ లో దాడులు చేసేందుకని పాక్ సరిహద్దుల్లో ఆగస్టు 28 నుంచే రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశామని తెలిపాయి. ఏడుగురు సాయుధులైన ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) నుంచి భారత్ లోని యూరి సెక్టార్ ప్రాంతంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించామని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.