: దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్


జమ్మూకాశ్మీర్ లోని యూరి సెక్టార్ పై ఉగ్రవాదుల దాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆర్మీ చీఫ్ దల్బీందర్ సింగ్ యూరీ సెక్టార్ లో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా ఎల్ ఓసీ సహా బారాముల్లా, యూరీ సెక్టార్లలో రహదారులను మూసివేశారు. వాయుమార్గంలో పారాకమాండోలను,సరిహద్దు వెంట భారీగా బలగాలను మోహరించారు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News