: ‘అనంత’ ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ కు కులగజ్జి పట్టింది: జేసీ దివాకర్ రెడ్డి


అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ కు కులగజ్జి పట్టిందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. అనంతపురంలో జిల్లాలో విషజ్వరాలపై జేసీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విఫలమయ్యారని, ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ లకు కులగజ్జి పట్టుకుందంటూ ఆరోపించారు. అనంతపురంలో పారిశుద్ధ్యం పడకేసిందని చెప్పినా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలకు సైతం వారు అడ్డుపడ్డారని జేసీ ఆరోపించారు.

  • Loading...

More Telugu News