: ప్రేయసిని చంపి పూడ్చి పెట్టి, దానిపై పరుపేసుకుని పడుకున్నాడు... కోపంలో నోరుజారి బుక్కయ్యాడు!


తన ప్రియురాలిని హత్య చేసి, సొంత ఇంట్లోనే పూడ్చి పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా తప్పించుకున్న ఆ హంతకుడు, కోపంలో నోరుజారి చెప్పిన మాటతో విషయం వెలుగులోకి వచ్చి కటకటాల వెనక్కి వెళ్లాడు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, ఘన్ శ్యామ్ అనే యువకుడు, కాజల్ అనే యువతి ప్రేయసీ ప్రియులు. వారం రోజుల క్రితం వీరిద్దరి మధ్యా గొడవ జరగడంతో, కాజల్ తలపై బలమైన వస్తువుతో ఘన్ శ్యామ్ బాదాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడే చనిపోయింది. విషయం బయటకు తెలియనీయకుండా, ఇంట్లోనే గుంత తీసి కాజల్ మృతదేశాన్ని అందులో పాతిపెట్టాడు. తవ్విన ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు పరుపు వేశాడు. రాత్రిళ్లు దానిపైనే నిద్రించాడు. నిన్న పక్కనే ఉన్న ఓ వ్యక్తితో ఘన్ శ్యామ్ కు గొడవైంది. మాటా మాటా పెరుగగా, ఇంకా ఎక్కువగా మాట్లాడితే, కాజల్ ను చంపినట్టే చంపి ఇంట్లో పాతిపెడతానని ఘన్ శ్యామ్ హెచ్చరించాడు. అప్పటికే కాజల్ కనిపించక రోజులు గడుస్తుండటంతో అనుమానం వచ్చిన అతను పోలీసులకు సమాచారం ఇవ్వగా, విచారణలో అసలు నిజం తేలింది. ఘన్ శ్యామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News