: కొడుకు అకృత్యానికి మద్దతు పలికిన సుశ్రుత మామ... జైల్లో గుండెపోటుతో మృతి


వాటర్ హీటర్ ను కాస్తంత ఎక్కువ సేపు వాడిందన్న చిన్న కారణానికి, నగ్నంగా ఉన్న కోడలు సుశ్రుతను, కొడుకు కొడుతుంటే, పెద్ద మనిషిగా అడ్డుకోవాల్సిన మామ శంకర్ రావు, కొడుకు అకృత్యానికి మద్దతిచ్చి అరెస్ట్ అయి, ఈ ఉదయం చంచల్ గూడ జైలులో గుండెపోటుతో మరణించాడు. కుటుంబ సభ్యుల ముందే జరిగిన అవమానానికి తట్టుకోలేని సుశ్రుత, తన తల్లిదండ్రులకు విషయం చెప్పి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సైదాబాద్ పోలీసులు సుశ్రుత భర్త, మామలను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ ఉదయం శంకర్ రావు మరణించడంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News