: కెపాసిటీని పెంచుకునేందుకు ఎయిర్ టెల్ కు డబ్బులిచ్చిన ముఖేష్ అంబానీ


రిలయన్స్ జియో కస్టమర్లు, తమ సెల్ ఫోన్ల నుంచి ఎయిర్ టెల్ వినియోగదారులకు చేస్తున్న కాల్స్ కలవడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ, మరిన్ని ఇంటర్ కనెక్ట్ పాయింట్లను అందించేలా కెపాసిటీని పెంచుకునేందుకు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో, ఎయిర్ టెల్ కు నిధులందించింది. జియో నుంచి తమకు పేమెంట్ అందిందని, ఈ నిధులతో ఇరు సంస్థలూ ఫిజికల్ కలెక్షన్, పోర్టుల టెస్టింగ్ తో పాటు కనెక్టివిటీ పాయింట్ల సంఖ్యను పెంచుకుంటామని తెలిపింది. 90 రోజుల్లోగా రిలయన్స్ కోరినన్ని ఇంటర్ కనెక్టింగ్ పాయింట్లను అందించేందుకు కృషి చేస్తామని తెలిపింది. ఈ మేరకు జియో సహకారాన్ని కూడా కోరుతున్నామని పేర్కొంది. తాము పెంచుతున్న ఇంటర్ కనెక్టివిటీ సామర్థ్యం 15 లక్షల మందికి సేవలందిస్తుందని, జియోకు ప్రస్తుతం ఉన్న వినియోగదారులతో పోలిస్తే ఇది చాలా అధికమని ఎయిర్ టెల్ ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News