: సుబ్బరామిరెడ్డిని పొగడుతూ, 'హ్యాట్సాఫ్ చిరం..' అంటూ తడబడిన దర్శకరత్న


నిన్న రాత్రి విశాఖపట్నం వేదికగా రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త టి.సుబ్బరామిరెడ్డి జన్మదిన వేడుకల్లో దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రసంగిస్తున్న వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. సుబ్బరామిరెడ్డి చేస్తున్న సేవలను కొనియాడుతూ, ప్రసంగిస్తున్న దాసరి తన ప్రసంగం మధ్యలో తడబడ్డారు. "ఇలాంటి సన్మానాలు, సత్కారాలను సుబ్బరామిరెడ్డి లాంటి వారు చేయకపోతే కళాకారుల ఘనత ఎలా తెలుస్తుంది? అనేది ఆలోచిస్తే, హ్యాట్సాఫ్ టూ చిరం... మన సుబ్బరామిరెడ్డి గారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ కాలం నిలిచిన హీరోలంతా తొలుత విలన్ గా ఇండస్ట్రీకి వచ్చిన వారు. వినోద్ ఖన్నా, శతృఘ్నసిన్హా, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ బాబు... అంటే విలన్ వేషం వేసిన వారు ఆల్ రౌండర్" అని అన్నారు.

  • Loading...

More Telugu News