: హెరిటేజ్ ఫుడ్స్ కు గోల్డెన్ పీకాక్ అవార్డు... అందుకోనున్న నారా భువనేశ్వరి
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ కు కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. వచ్చే నెలలో 17 నుంచి 20 వరకూ లండన్ లో 16వ 'లండన్ గ్లోబల్ కన్వెన్షన్ ఆన్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ సస్టెయినబిలిటీ' సదస్సులో ఈ అవార్డును హెరిటేజ్ ఫుడ్స్ అందుకోనుంది. అవార్డును స్వీకరించేందుకు రావాలని సంస్థ ఎండీ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి గోల్డెన్ పీకాక్ అవార్డుల కమిటీ సెక్రటేరియెట్ డైరెక్టర్ జనరల్ వివేక్ అగ్నిహోత్రి నుంచి ఆహ్వానం అందింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ వెంకటాచలయ్య ఆధ్వర్యంలోని భారత జ్యూరీ హెరిటేజ్ ఫుడ్స్ ను అవార్డుకు ఎంపిక చేసింది.