: మాన్‌హట్టన్‌లో భారీ పేలుడు.. పలువురికి గాయాలు
అమెరికాలోని మాన్‌హట్టన్‌లో శనివారం రాత్రి 8:30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టు తెలుస్తుండగా ముగ్గురిని మాత్రం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో మొత్తం ఎంతమంది గాయపడ్డారనే విషయం తెలియరాలేదు. పేలుడు ఎలా జరిగింది, ఎవరు చేశారు? అనే విషయాన్ని నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు, అగ్నిమాపక అధికారులు తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.