: నేవీ అమ్ముల పొదిలోకి మోర్ముగావ్.. రాడార్లకు చిక్కని క్షిపణులను కూడా ఛేదించగల పరిజ్ఞానం దీని సొంతం


స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక మోర్ముగావ్ యుద్ధ నౌక భారత నేవీలో చేరింది. అణు విధ్వంసక నౌక అయిన మోర్ముగోవ్‌ను శనివారం నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా ముంబైలో ఆవిష్కరించడంతో అరేబియా సముద్రంలో జలప్రవేశం చేసింది. ఈ సందర్భంగా సునీల్ లాంబా మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యాధునిక నౌకల్లో ఇదొకటని అన్నారు. ఈ నౌకను మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) తయారుచేసింది. ప్రాజెక్ట్ 15 బి క్లాస్ ప్రాజెక్ట్ విధ్వంసక నౌకల్లో మోర్ముగావ్ రెండోది. తొలి నౌకను ఏప్రిల్ 20,2015న విశాఖపట్నంలో ప్రారంభించారు. రాడార్లకు దొరకని శత్రుదేశాల క్షిపణులను సైతం ఇది తుత్తునియలు చేయగలదు. ఈ నౌకకు మరిన్ని పరీక్షలు అవసరమని ఇండియన్ నేవీ పేర్కొంది. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం దీని సేవలను వినియోగించుకుంటామని పేర్కొంది. 2020-24 నాటికి మరో నాలుగు నౌకలను ఎండీఎల్ నిర్మించి నేవీకి అందించనుంది. 7,300 టన్నుల బరువున్న మోర్ముగావ్ 30 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గాల్లోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. అలాగే యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్లు కూడా ఇందులో ఉన్నాయి. యాంటీ సబ్‌మెరైన్ యద్ధ హెలికాప్టర్లను కూడా ఈ నౌక మోసుకెళ్లగలదు.

  • Loading...

More Telugu News