: సూయజ్ ఎంఎస్-02 నౌకలో సాంకేతిక సమస్య.. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని రద్దు చేసిన రష్యా
మానవ సహిత ప్రయోగానికి సిద్ధమైన రష్యా ఆ ప్రయత్నాన్ని రద్దు చేసుకుంది. సాంకేతిక సమస్యలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సూయజ్ ఎంఎస్-02ను ఈ నెల 23న ప్రయోగించాల్సి ఉంది. అయితే తాజాగా కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ ప్రయోగ కేంద్రంలో నౌకకు జరిపిన పరీక్షలో శాస్త్రవేత్తలు పలు సాంకేతిక సమస్యలను గుర్తించారు. దీంతో ప్రయోగాన్ని రద్దుచేస్తున్నట్టు రష్యా ప్రకటించింది. సమస్యలను పూర్తిస్థాయిలో సరిచేసిన అనంతరం ప్రయోగాన్ని చేపడతామని పేర్కొన్న రష్యా తేదీని మాత్రం ప్రకటించలేదు. ఎంఎస్-02లో రష్యాకు చెందిన ఇద్దరు, అమెరికాకు చెందిన ఓ వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.