: చారిత్రక టెస్ట్ కేక్ కట్‌ చేసిన కోహ్లీ.. బర్త్ డే జరుపుకున్న అశ్విన్


చారిత్రక 500 టెస్ట్ కోసం సన్నద్ధమవుతున్న టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా కాన్పూర్ చేరుకుంటున్నారు. జట్టు సారథి విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్, మురళీ విజయ్, అజింక్యా రహానే, ఉమేష్ యాదవ్ శనివారం సాయంత్రమే హోటల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా హోటల్ వర్గాలు ప్రత్యేకంగా తయారుచేయించిన '500 టెస్ట్ కేక్‌'ను కోహ్లీ కట్ చేశాడు. అనంతరం అశ్విన్ సహచరులతో కలిసి బర్త్ డే వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఈనెల 22న చారిత్రక టెస్ట్ జరగనున్న సంగతి తెలిసిందే. సోమవారం కివీస్ జట్టు కాన్పూర్ చేరుకుంటుంది.

  • Loading...

More Telugu News