: కాజల్ నొచ్చుకుంది.. ఇక ఐటెం సాంగ్స్ చేయదట!

జూనియర్ ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’లో ఐటెం సాంగ్‌తో రెచ్చిపోయిన కాజల్ అగర్వాల్ ఇక నుంచి అలాంటి పనిచేయనని తెగేసి చెబుతోంది. కాజల్ సాంగ్ అభిమానులకు తెగ నచ్చేసినా కొందరు సినీ జనాలు మాత్రం ఆమె ఐటెంసాంగ్ చేయడాన్ని ఎగతాళి చేస్తున్నారట. ఈ విషయం తెలియడంతో నొచ్చుకున్న కాజల్ ఇక నుంచి ఐటెం సాంగ్స్‌లో చిందేసే ప్రసక్తే లేదని చెబుతోంది. అయితే ‘జనతా’ లో తాను చిందేసిన సాంగ్‌ను అందరూ ఐటెం సాంగ్ అంటున్నారని, కానీ అది వాస్తవానికి ప్రత్యేక గీతమని సమర్థించుకునే పనిలో పడింది. టాప్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్‌లో నటించడం బాలీవుడ్‌లో మొదలై క్రమంగా టాలీవుడ్‌కు పాకింది. హీరోయిన్‌గా చేయడం కంటే రెండుమూడు కాల్‌షీట్లతోనే కోట్లాది రూపాయలు వచ్చి పడుతుండడంతో టాప్ హీరోయిన్లు ‘ఐటెం’లకు సై అంటున్నారు. శృతిహాసన్, తమన్నా, అనుష్క తదితరులు కూడా ఐటెం సాంగ్స్‌లో చిందేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘జనతా’ సాంగ్‌తో అటువంటి ఆఫర్లే వస్తున్నాయని పేర్కొన్న కాజల్ వాటిని తిరస్కరిస్తోందట. ప్రస్తుతం కాజల్ తమిళంలో జీవా, అజిత్, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నంబరు 150 సినిమాతోపాటు తేజా దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది.