: వజ్రోత్సవాల వేళ సరికొత్త మనీ బ్యాక్ 'బీమా డైమండ్'ను ప్రకటించిన ఎల్ఐసీ


ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రారంభమై 60 సంవత్సరాలు పూర్తయిన వేళ సరికొత్త మనీ బ్యాక్ పాలసీని విడుదల చేయాలని నిర్ణయించింది. వజ్రోత్సవాల సందర్భంగా వచ్చే సంవత్సరం ఆగస్టు 31 వరకూ అందుబాటులో ఉండేలా 'బీమా డైమండ్' పేరిట లిమిటెడ్ ప్రీమియం చెల్లింపులతో 16, 20 లేదా 24 సంవత్సరాల పాటు అమలయ్యే పాలసీలను ఆఫర్ చేస్తోంది. ఈ పాలసీలను ఎంచుకునే కాలపరిమితిని బట్టి ప్రీమియాన్ని 10, 12, 15 సంవత్సరాల పాటు చెల్లించాల్సి వుంటుంది. పాలసీకి అదనంగా యాక్సిడెంటల్ డెత్, వికలాంగత్వ ప్రయోజనాల రైడర్లను ఎంచుకోవచ్చని ఎల్ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. కొంత గడువు తరువాత పాలసీదారులకు రుణాలు కూడా ఆఫర్ చేయనున్నట్టు వివరించింది.

  • Loading...

More Telugu News