: మేమిద్దరం చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో నటించాం: జయసుధ


మోహన్ బాబుది, తనది సినీ ప్రస్థానం ఇంచుమించు ఒకేసారి ప్రారంభమైనట్టు సహజ నటి జయసుధ తెలిపింది. ఆమె మాట్లాడుతూ, మోహన్ బాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పుడు, తాను చెప్పే డైలాగులను సరిచేసేవారని గుర్తుచేసుకున్నారు. 'నువ్వు డైలాగులు సరిగ్గా చెప్పడం లేదమ్మాయ్' అనేవారని తెలిపింది. దాసరి దర్శకత్వంలో తామిద్దరం కలిసి చేసిన ఎన్నో సినిమాలు రికార్డు విజయాలు సాధించాయని, సినీ చరిత్రలో నిలిచిపోయే సినిమాలలో దాసరి తామిద్దరితో నటింపజేశారని ఆమె చెప్పారు. తామిద్దరం కలిసి ఇంతగొప్ప సినిమాల్లో నటించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఆయన తొలినాళ్ల నుంచి నేటి వరకు అదే గొంతుతో ఉండడం ఎంతో అభినందనీయమని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News