: నీ అంత అందగత్తెను నేను ఇంత వరకు చూళ్లేదంటారు మోహన్ బాబు!: జయప్రద
మోహన్ బాబు తనకు ఫోన్ చేసిన ప్రతిసారి 'ఏయ్! జయప్రద' అంటూ సంబోధిస్తుంటారని సినీ నటి జయప్రద తెలిపారు. అలా ఆయన పిలిచిన ప్రతిసారీ భయం వేస్తుందని ఆమె అన్నారు. విశాఖపట్టణంలో ఆమె మాట్లాడుతూ, 'నీ అంత అందగత్తెను నేను ఇంతవరకు చూళ్లేదమ్మాయ్' అని అంటూ ఉంటారని అన్నారు. అది నిజమో కాదో తనకు తెలియదు కానీ, ఆయనతో పాటు తామంతా నటించామంటే గర్వంగా ఉంటుందని అన్నారు. ఆయనకు జరిగిన ఈ సత్కారాన్ని కనులారా వీక్షించేందుకు ఉదయ్ పూర్ నుంచి వైజాగ్ వచ్చి మంచి అనుభూతిని మూటగట్టుకున్నానని ఆమె అన్నారు.