: ఈ 40 ఏళ్లే కాదు, మరో 40 ఏళ్లు ఆయన బాగుండాలి: సురేష్ బాబు
సినీ నటుడు మోహన్ బాబు అంకుల్ చాలా మంచి మనసున్నవాడని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అన్నారు. విశాఖపట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరిగిన టి.సుబ్బరామిరెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను విద్య కోసం అమెరికా వెళ్తున్న సమయంలో ఆయన తన మెడలో దండ వేసి ఆశీర్వదించారని, తన జీవితంలో మొట్టమొదట దండ వేయడం అదేనని, ఆయన అంత మంచివారని అన్నారు. బయటకు మోహన్ బాబు ఎలా కనిపించినా ఆయన చాలా మంచి మనిషి అని సురేష్ బాబు తెలిపారు. గడచిన 40 ఏళ్లు మాత్రమే కాదు, మరో 40 ఏళ్లపాటు ఆయన ఇలాగే ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.