: నాకు మాట్లాడడం రాదు...చప్పట్లు కొట్టకపోయినా పర్లేదు: రాఘవేంద్రరావు


వైజాగ్ తీరాన్ని అలలు తాకడం ఎంత నిజమో, సుబ్బరామిరెడ్డి కళలను ప్రోత్సహించడం కూడా అంతే నిజమని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు. విశాఖపట్టణంలోని ఇందిరా ప్రియదర్శని స్టేడియంలో జరిగిన సుబ్బరామిరెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు బాగా మాట్లాడడం రాదని, అందుకే తన మాటలకు చప్పట్లు కొట్టకపోయినా పర్లేదని అన్నారు. ఒక వ్యక్తి గొప్ప ఒక స్థాయికి చేరుకోవడానికి చాలా కారణాలుంటాయని, అలాగే మోహన్ బాబు కూడా ఉన్నత స్థానానికి చేరడంలో చాలా విశేషాలు ఉన్నాయని ఆయన తెలిపారు. తెలుగు సినీ హీరోలు గుర్తించాల్సిన విషయం ఏంటంటే... తెలుగు సినీ పరిశ్రమలో మోహన్ బాబు అందరు హీరోలు చేసిన పాత్రలతో పాటు, సినిమాల్లో ఉండే అన్నిరకాల వేషాలు వేసి మెప్పించాడన్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన హీరోలెవరూ మోహన్ బాబు వేసిన పాత్రలు పోషించలేరని అన్నారు. సినీ నటులకు సవాల్ విసిరేంత గొప్ప మనిషి మోహన్ బాబు అని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News