: హైదరాబాదులో భారీ ట్రాఫిక్ జామ్
హైదరాబాదులో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్డీకాపూల్ నుంచి మాసబ్ ట్యాంక్ వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అలాగే, ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్, లక్డీకాపూల్, ట్యాంక్ బండ్ రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు మొజంజాహీ మార్కెట్ నుంచి అఫ్జల్ గంజ్, అబిడ్స్, కోఠీ తదితర రహదారుల్లో కూడా వాహనాలు బారులుతీరడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఈ రహదారులపై వెళ్లాలంటే గంటలకుపైగా సమయం పట్టే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ట్రాఫిక్ ను చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.