: విశాఖలో ప్రారంభమైన సుబ్బరామిరెడ్డి పుట్టిన రోజు వేడుకలు
ప్రముఖ వ్యాపారవేత్త, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు వేడుకలు విశాఖపట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాసమితి మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్, దర్శకరత్న దాసరి నారాయణరావు, మెగాస్టార్ చిరంజీవి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీ నటులు వెంకటేష్, శ్రీదేవి, మంచు విష్ణు, మనోజ్, లక్ష్మి, బోనీ కపూర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఇతర సినీ నటులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆహ్లాదకర వాతావరణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు విశాఖ ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు.