: అల్పాదాయ వర్గాల వారికి అందుబాటు ధరల్లో 5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న 'రక్తచరిత్ర' హీరో


ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ అల్పాదాయ వర్గాల ప్రజలకు 5 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. 'మిషన్ 360' పేరుతో మహారాష్ట్రలోని 360 ప్రాంతాల్లో ఈ ఇళ్లు నిర్మించనున్నామని 'రక్తచరిత్ర' హీరో తెలిపాడు. 2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాన్ని స్పూర్తిగా తీసుకుని అల్పాదాయ వర్గాల ఇళ్లకు రూపకల్పన చేసినట్టు 'కర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్' అధినేత కూడా అయిన ఆయన తెలిపారు. తమ ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన తెలిపారు. లాభాలు ఆశించకుండా మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ ఇళ్ల ధరను 7,90,000 రూపాయలుగా నిర్ణయించామని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి భూమిని సేకరించలేదని, ప్రైవేటుగా సేకరించామని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా తమకు ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయని, అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News