: కడుపు నింపుకోవాలి కాబట్టే సినిమాలు చేస్తున్నాను: అమితాబ్ బచ్చన్
కడుపు నింపుకోవాలి కాబట్టే తాను సినిమాలు చేస్తున్నానని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అన్నారు. ఇండియా టు డే మైండ్ రాక్స్ కార్యక్రమంలో 'పింక్' సినిమా ప్రమోషన్ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ, 'ప్రతి రోజూ నిద్ర లేస్తాను. ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉంటాను. నేను కూడా కడుపు నింపుకోవాలి కాబట్టే సినిమాల్లో పని చేస్తున్నాను. మీరు కూడా అందుకే కదా ఉద్యోగాలు చేసేది' అని మీడియాను ప్రశ్నించారు. తనకు స్పూర్తి తన తల్లి అని చెప్పారు. చిన్నపుడు ఓ సారి ఇంటి వెనుక ఆడుకుంటుండగా, కొంత మంది తన వయసు పిల్లలు తనను కొట్టారని, అప్పుడు తాను ఏడుస్తూ ఇంట్లోకెళ్లగా, తన తల్లి తనలో స్పూర్తి నింపి తిరిగి వారిని కొట్టమని పంపారని ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆమె సిక్కు మహిళ అని, అందుకే తాను సగం సర్దార్ నని ఆయన తెలిపారు.