: జగిత్యాలలో పసికందును లాక్కొచ్చిన పందులు... శిశువు మృతి
కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని బట్టివాడలో ఈరోజు విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పసికందును నోట్లో కరచుకొని పందులు లాక్కొచ్చాయి. శిశువు మృతి చెందిందన్న విషయాన్ని గమనించిన స్థానికులు ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక పోలీసులకు ఈ సమాచారాన్ని అందజేశారు. ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.