: ఆ రెస్టారెంటులో భోజనం బాగోలేదంటే డబ్బులు చెల్లించక్కర్లేదు సరికదా, 200 రూపాయలు తీసుకెళ్లవచ్చు!


చైనాలోని జీజియాంగ్‌ ప్రావిన్స్‌లోని తైజు నగరంలో ‘గో టూ మై హోమ్‌’ అనే రెస్టారెంట్‌ వినూత్న పోకడను అనుసరిస్తోంది. ఈ రెస్టారెంట్ లో సిబ్బంది పనితీరుపై అక్కడి యజమాని జు క్సియోజిన్‌ అంతులేని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమ రెస్టారెంట్ లో భోజనం బాగాలేదని కానీ, సిబ్బంది పనితీరు బాగాలేదని కానీ నిరూపిస్తే... 'భోజనం బిల్లు తీసుకోము సరికదా, తిరిగి 20 యువాన్ (200 రూపాయలు) చెల్లిస్తా'మని వినియోగదారులకు అ యజమాని సవాల్ విసురుతున్నాడు. ఓ టీవీ షో చూసిన తరువాత తనకు ఇలాంటి వినూత్న రెస్టారెంట్ నెలకొల్పాలనే ఆలోచన వచ్చిందని జు క్సియోజిన్‌ తెలిపారు. దానిని అనుసరిస్తూ, పరిశుభ్రమైన వాతావరణంలో, చక్కని, రుచికరమైన ఆహారం గౌరవ మర్యాదలతో తమ సిబ్బంది అందజేస్తారని, అందుకే తాము ప్రతి వెయిటర్ షర్టుకు 20 యువాన్ నోటు అమరుస్తామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు తమ ఆహార పదార్థాలపై లేదా, గౌరవ మర్యాదలపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News