: సమస్యలు వినకుండా వెళ్లిపోతున్న కేంద్రమంత్రిని ఆపేందుకే ఇంకు చల్లాం: భోపాల్ ఎయిమ్స్ విద్యార్థులు
భోపాల్లోని ఎయిమ్స్ కళాశాలలో వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈరోజు ఎయిమ్స్కి వచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డాపై విద్యార్థులు ఇంకు చల్లిన విషయం తెలిసిందే. అక్కడి వరకూ వచ్చి తమ సమస్యలు వినకుండా వెళ్లిపోతున్న మంత్రిని ఆపేందుకే తాము ఇంకు చల్లినట్లు విద్యార్థులు మీడియాకు తెలిపారు. కళాశాలలో ఉత్తమ అధ్యాపకులను నియమించాలని నడ్డాను తాము కోరినట్లు విద్యార్థులు తెలిపారు. ఎన్నో రోజులుగా ఆందోళన చేస్తున్నా తమ గురించి ఆయన పట్టించుకోవడం లేదని, చివరికి ఈ రోజు ఇక్కడికి వచ్చికూడా ఆయన నిర్లక్ష్యధోరణి కనబరిచారని విద్యార్థులు కళాశాల ముందే కూర్చొని ఆందోళన తెలుపుతున్నారు.