: కేంద్ర మంత్రిపై ఇంకు చల్లి నిరసన వ్యక్తం చేసిన ఎయిమ్స్ విద్యార్థులు
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాపై రంగు పడింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఎయిమ్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జేపీ నడ్డా వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ లో సౌకర్యాల కల్పనలో కేంద్రం అలసత్వం వహిస్తోందంటూ విద్యార్థులు ఆరోపించారు. మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. బోధనా సిబ్బందిని నియమించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిరసనలతో హోరెత్తించి, మంత్రిపై ఇంకు చల్లారు. తెల్ల షర్టు వేసుకున్న ఆయనపై నల్ల ఇంకు మరకలు స్పష్టంగా కనిపించాయి.