: ధ‌ర్మ‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌లో ఐదుగురు బీటెక్‌ విద్యార్థుల గల్లంతు.. ఇద్దరి మృత‌దేహాలు వెలికితీత‌


వరంగల్‌లోని ధ‌ర్మ‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌ వ‌ద్ద ఈరోజు విషాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో సరదాగా గడపడానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతయ్యారు. ప్ర‌త్యూష అనే విద్యార్థిని ప్రాణాలతో బయటపడింది. వీరంతా వాగ్దేవీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్యూట‌ర్ సైన్స్ లో థ‌ర్డ్ ఇయ‌ర్ విద్యార్థులుగా పోలీసులు పేర్కొన్నారు. గ‌ల్లంత‌యిన వారిని శ్రావ్యారెడ్డి, వినూత్న, శివ‌సాయి, శివ‌సాయికృష్ణ‌, సాగ‌ర్‌గా గుర్తించారు. వెంట‌నే గ‌జ ఈతగాళ్లను రంగంలోకి దింపిన పోలీసులు జలాశయం నుంచి శ్రావ్యారెడ్డి, వినూత్న మృత‌దేహాలను వెలికితీశారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News