: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిల మధ్య వాగ్వివాదం
టీఆర్ఎస్ నేతలు తెలంగాణ విలీన దినోత్సవం నిర్వహిస్తోంటే.. బీజేపీ, టీడీపీ నేతలు విమోచన దినం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు బీజేపీ నేత, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తమ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేసేందుకు వెళ్లారు. అయితే, అసెంబ్లీ గేటు వద్దే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకి, కిషన్‌రెడ్డికి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.