: నేనూ క్రమశిక్షణ కలిగిన స్వయం సేవకుడినే: మనోహర్ పారికర్


తాను సైతం క్రమశిక్షణ కలిగిన స్వయం సేవకుడినే (ఆర్ఎస్ఎస్ సభ్యుడు)నని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే ఏడాది గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఆర్ఎస్ఎస్ తిరుగుబాటు నేత సుభాష్ వెలింగార్ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. దీనిపై విలేకరులు ఈ రోజు పనాజిలో పారికర్ ను ప్రశ్నించగా... ‘ఇక్కడ ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఆప్ కూడా ఉంది. ఎవరైనా పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్యం’ అని పేర్కొన్నారు. గోవా ఆర్ఎస్ఎస్ లో జరగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. తాను సైతం క్రమశిక్షణ కలిగిన స్వయం సేవకుడినేనన్న విషయాన్ని గుర్తు చేశారు. ‘నేను కూడా స్వయం సేవక్ నే. ఆర్ఎస్ఎస్ ను అనుసరిస్తాను. మీరు కూడా అనుసరించవచ్చు’ అని ఆయన విలేకరులకు సూచించారు. తాను క్రమశిక్షణ ప్రకారం నడుచుకుంటానని, ఆర్ఎస్ఎస్ పై ఏదైనా కామెంట్ కావాలనుకుంటే ఆర్ఎస్ఎస్ నే సంప్రదించాలన్నారు.

  • Loading...

More Telugu News