: విశాఖ పోర్టులో మహిళా కార్మికురాలిపై దాడి.. విధులు బహిష్కరించిన 1500 మంది కార్మికులు
విశాఖపట్నం పోర్టులో కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజు మెరుపుసమ్మెకు దిగారు. ఒక మహిళా కార్మికురాలిపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది చేయిచేసుకున్నారంటూ 1500 మంది కార్మికులు విధులు బహిష్కరించి నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మహిళపై దాడి జరిగిన ఘటన గురించి తాము ఐటీఎల్ జీఎం, ట్రాన్స్‌పోర్ట్ ఇంఛార్జ్ లకు చెప్పామని, అయితే సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారిపై కూడా దాడి చేశారని కార్మికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వారి తీరును ఖండిస్తున్నామని చెప్పారు. కార్మికుల సమ్మెతో పోర్టులో ట్రాన్స్‌పోర్ట్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై స్పందించిన పోర్ట్ డిప్యూటీ ఛైర్మన్ హరినాథ్ ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.