: తమిళనాట ఇక ‘అమ్మ’ కల్యాణ మండపాలు


గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు రెండోసారి పట్టం కట్టిన తమిళులకు సీఎం జయలలిత మరో పథకాన్ని పరిచయం చేశారు. 'అమ్మ' కల్యాణ మండపాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీలు.. ఇలా అమ్మ పేరుతో ఎన్నో పథకాలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు. రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో అమ్మ కల్యాణ మండపాలను నిర్మించనున్నట్టు సీఎం జయలలిత శనివారం ప్రకటించారు. ఇందుకు రూ.83 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. వీటిని పేదలు ఆన్ లైన్ విధానంలో బుక్ చేసుకుని ఎలాంటి చార్జీలు లేకుండా తమ వేడుకలను జరుపుకోవచ్చని ఆమె వెల్లడించారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారు వేలాది రూపాయలతో మండపాలను బుక్ చేసుకునే విషయంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న జయలలిత పేదల ప్రయోజనాల కోణంలో కల్యాణ మండపాల నిర్మాణానికి ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ మండపాలలో వరుడు, వధువులకు ఏసీ గదులు, అతిథులకు గదులు, డైనింగ్ హాల్, కిచెన్ ఉంటాయని తెలిపారు.

  • Loading...

More Telugu News