: ప్రధానిని మీరూ విష్ చేయవచ్చు... ఇదిగో ఇలా!
66 వసంతాలు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి మీరూ శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. నరేంద్రమోదీ యాప్ లో ఇందుకోసం ప్రత్యేకంగా ఓ విభాగం కేటాయించారు. ఈ విభాగం ద్వారా దేశ పౌరులు ఎవరైనా సరే తమ స్మార్ట్ ఫోన్ నుంచి ప్రధాని నరేంద్రమోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు. ఎవరికి వారు తమ సొంతంగా గ్రీటింగ్ కార్డును రూపొందించి పంపుకునే వెసులుబాటు కూడా ఉంది. తమ సొంత ఫొటో, మోదీ ఫొటోను ఉపయోగించి గ్రీటింగ్ కార్డును డిజైన్ చేసి పంపవచ్చు. ఒకసారి కార్డును పంపడం ముగిసిన తర్వాత తిరుగు టపాలో వారికి ఓ వీడియో అందుతుంది. దీన్ని ఇతరులతో షేర్ కూడా చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రధాని మోదీ చేపట్టిన స్వచ్చ్ భారత్, మేకిన్ ఇండియా, బేటీ బచావో బేటీ పడావో తదితర కార్యక్రమాలను ప్రశంసిస్తూ పలువురు ప్రముఖులు విషెస్ కూడా చెప్పారు.