: మాతృమూర్తి సమక్షంలో ప్రధాని జన్మదిన వేడుకలు


ప్రధాని నరేంద్ర మోదీ 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. తన పుట్టిన రోజును ఆడంబరాలకు పోకుండా జరుపుకున్నారు. పుట్టిన రోజు నేపథ్యంలో మోదీ శుక్రవారం రాత్రి అహ్మదాబాద్ లోని కన్నతల్లి హీరాబెన్ నివాసానికి చేరుకున్నారు. అమ్మ పాదాలకు నమస్కరించగా... కుమారుడ్ని ఆమె మనసారా ఆశీర్వదించారు. అంతకుముందు మోదీకి రాష్ట్ర గవర్నర్ కోహ్లీ, సీఎం విజయరూపానీ, బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ నేరుగా ప్రధాని మోదీని కలసి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ గుజరాత్ లోని వాద్ నగర్ లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.

  • Loading...

More Telugu News